Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
మండలపరిధిలోని కాశీగూడెం గ్రామపంచాయతీలోని తెట్టేకుంటతండా గ్రామపంచాయతీకి మూడు కిలోమీటర్ల దూరంలో 500కు పైగా జనాభా ఉంటుంది. తెట్టేకుంటతండా ప్రజలు నిత్యావసర సరుకులకు నిత్యం ప్రతి చిన్న అవసరానికి కాశీగూడెం మీదుగా ఏపూర్ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది.వెళ్లడానికి రోడ్డు బాగోలేక గుంతలమయంగా మారింది.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో కంకర రోడ్డు వేశారు.గతేడాది సెప్టెంబర్ నెలలో వివిధ పత్రికలలో కథనం ప్రచురితమవ్వగా దానికి స్పందించి మంత్రి జగదీశ్‌రెడ్డి రోడ్డు నిర్మాణం కోసం తాత్కాలిక పనుల నిమిత్తం రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు.నిధులతో మట్టి పోసి చేతులు దులుపుకున్నారు. కానీ వాహనాల రద్దీ వలన మట్టి కొట్టుకుపోయి యథావిధిగా మళ్లీ గుంతలుపడ్డాయి. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ల కోసం ఏపూరు గ్రామం వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదు.గతేడాది పురిటినొప్పులతో మహిళ హాస్పిటల్ కి వెళ్లాలంటే అంబులెన్స్ సకాలంలో రాక పాప పుట్టి మరణించింది. గ్రామానికీ అంబులెన్స్ రోడ్డు సౌకర్యం లేనందున రావడం లేదు. గ్రామ ప్రజలు రాత్రి సమయాల్లో తమ అవసరాలు నిమిత్తం రోడ్డుమీదిగా రావాలంటే భయపడుతున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తారు రోడ్డు వేయాలని తెట్టేకుంటతండా ప్రజలు కోరుతున్నారు.
రోడ్డంతా బురదగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు
హర్యానానాయక్-గ్రామస్తుడు
వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మట్టి పోసి న రోడ్డు మొత్తం బురదగా మారి రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. 60 మంది వద్ధులం పింఛన్ తీసుకునేవాళ్లం ఉన్నాం.నెలనెలా పింఛన్ తీసుకోవడానికి నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి ఆర్ఎంపీ వద్దకు వెళ్లాలన్నా, మెడిసిన్ తెచ్చుకోవాలన్నా ఏపూరు గ్రామం వెళ్లాల్సిందే. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మంజూరు చేసి తారు రోడ్డు వేయాలి.