Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళ సై సౌందర రాజన్
నవతెలంగాణ-నకిరేకల్
సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ నల్లగొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణంలో నివాస గహాలు సరిగా లేని నిరుపేదలకు మంగళవారం గవర్నర్ తమిళ్ సౌందర రాజన్ చేతుల మీదుగా టార్పాలిన్ పట్టాలు, హైజినిక్ కిడ్స్, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం రెడ్ క్రాస్ యూత్ వాలంటరీ మమత తన చేతితో గీసిన గవర్నర్ ఫోటోను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ పి విజరు కుమార్ బాబు, రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ జి. రమణ, జిల్లా యూత్ కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జూనియర్ కోఆర్డినేటర్ మందడి నర్సిరెడ్డి, రెడ్ క్రాస్ లైఫ్ నెంబర్ ముత్యంరెడ్డి, రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్స్ సద్దాం హుస్సేన్, శ్రవణ్, శివసాయి, ముదిరెడ్డి సైదిరెడ్డి, మాలే సైదిరెడ్డి, బంటు శ్రీనివాస్, సతీష్, వెంకటేష్ పాల్గొన్నారు.