Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ కొండల్రావు
నల్లగొండ : జనాభా పెరుగుదల నియంత్రణలతోనే సమాజాభివృద్ధి సాధ్యమని డీఎంహెచ్ఓ కొండల్రావు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తన కార్యాలయ సమావేశ మందిరంలో అవగాహన,కుటుంబ నియంత్రణ పద్ధతులపై వైద్యపిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఆశా నుంచి వైద్యాధికారి వరకు అందరూ విధిగా కుటుంబ నియంత్రణ పద్ధతులపై మరీ ముఖ్యంగా తాత్కాలిక పద్ధతులపై ప్రజల్లో విస్తత అవగాహన కల్పించాలని సూచించారు వైద్యవత్తిలో ప్రవేశించిన యువ డాక్టర్లు మొదట ట్యుబెక్టమి ఆపరేషన్ చేయడం నేర్చుకుంటే గౌరవంగా ఉంటుందన్నారు.అనంతరం కుటుంబనియంత్రణలో అత్యున్నత సేవలందించిన డాక్టర్ నర్సింహులు, స్టాఫ్‌నర్స్ జ్యోతి, మూడు డివిజన్లకు చెందిన ముగ్గురు ఆశాలు ఇందిర ,వసంత, రజితలకు ప్రసంశాపత్రాలు, మెమెంటోలు అందజేశారు.కార్యక్రమంలో డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, రామ్మోహన్ పాల్గొన్నారు.