Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో సంచారజాతుల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ విముక్తి,సంచార జాతుల అభివద్ధి,సంక్షేమబోర్డు సభ్యులు తురక నర్సింహ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సంచారజాతుల సంక్షేమంపై నిర్వహించిన సమావేశంలో ఆయన అదనపుకలెక్టర్ ఎస్.మోహన్‌రావుతో కలిసి మాట్లాడారు.జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయలక్ష్యంగా అనేక అభివద్ధి, సంక్షేమపథకాలు ప్రవేశపెట్టామన్నారు.ఆ దిశగా అధికారులు అందేలా చూడాలన్నారు. సంచారజాతుల పిల్లలకు జిల్లాలో అన్ని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించి గుణాత్మకమైన విద్యానందించాలని సూచించారు.ఇప్పటివరకు సంబంధిత శాఖల వారీగా అమలు చేసిన పథకాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డీఈఓ అశోక్, డీఎఫ్ఓ ముకుందారెడ్డి, డీఎస్పీ నాగభూషణం, సంక్షేమ అధికారులు శంకర్, జ్యోతిపద్మ , దయానందరాణి, అనసూర్య పాల్గొన్నారు.