Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్‌లో రాష్ట్ర మహాసభలు,అక్టోబర్‌లో జాతీయ మహాసభలు
- సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
మతోన్మాదశక్తులను సంఘటితంగా ఎదుర్కోవాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం పట్టణంలోని ఆర్ఎస్వీ ఫంక్షన్హాల్లో సీపీఐ జిల్లా మూడో మహాసభల సందర్భంగా రెండవ రోజు ప్రతినిధుల మహాసభలో ఆయన మాట్లాడారు.బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడాలన్నారు.గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి 37శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని, మిగతా పార్టీల్లో ఐక్యత ఉంటే అధికారంలోకి వచ్చేది కాదన్నారు.అధికార దుర్వినియోగంతో బీజేపీ గద్దెను ఎక్కుతుందని విమర్శించారు.బెదిరింపు ధోరణికి పాల్పడుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ శాశ్వతంగా అధికారంలో ఉండే ఎజెండాతో ముందుకు కొనసాగుతుందన్నారు.కోర్టులకు సీబీఐకి స్వతంత్రత లేకుండా చేస్తుందని ధ్వజమెత్తారు.నల్లధనాన్ని బయటపెడతామని మోడీ చేసిందేమీ లేదన్నారు. దేశంలోనే బలమైన వ్యవస్థ మిలిటరీవ్యవస్థలో అగ్నిపథ్ పేరుతో నిరుద్యోగులతో చెలగాటమాడు తుందన్నారు. ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ కార్యకర్తలకు మతోన్మాదుల శిక్షణ కోసమే అగ్నిపథ్‌ను తీసుకొచ్చిందన్నారు.లాభాల్లో బాటలో ఉన్న ఎల్ఐసీిని ప్రయివేటీకరణ చేస్తుందన్నారు.అనేక పోరాటాలతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఒప్పించి బ్యాంకులను జాతీయీకరణ చేయిస్తే బీజేపీ ప్రభుత్వం ప్రయివేటీకరణ చేస్తుందని ఆరోపించారు.దేశంలో సరిపడా బొగ్గు నిలువలు ఉన్నా కార్పొరేట్‌శక్తుల కోసం బలవంతంగా రాష్ట్రాల ద్వారా అధికధరలకు బొగ్గును కొనుగోలు చేయిస్తుందని విమర్శించారు.తమ పార్టీ రైతులకు, కార్మికులకు అండగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడు తుందన్నారు. సెప్టెంబర్‌లో రాష్ట్ర మహాసభలు, అక్టోబర్‌లో జాతీయ మహాసభలు ఉంటాయని, ఆయా సభలో భవిష్యత్ కార్యచరణను రూపొందించి పాలకవర్గాల వ్యతిరేక విధానాలపై పోరాడు తామన్నారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్న చంద్రశేఖర్, సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు, ఆహ్వానసంఘం అధ్యక్షులు మేకల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉస్తెల సజన, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తెలనారాయణరెడ్డి, ఎల్లాంల యాదగిరి, షేక్లతీఫ్, బొల్లు ప్రసాద్, కౌన్సిలర్ మండల కార్యదర్శి బత్తినేనిహనుమంతరావు, బద్దంకష్ణారెడ్డి, మండవవెంకటేశ్వర్లు, ఎల్లావుల రాములు, పాలకూరి బాబు, ధూళిపాళ్ల ధనుంజయనాయుడు, కొండ కోటయ్య, పోకలవెంకటేశ్వర్లు, దోరేపల్లిశంకర్, సూర్యనారాయణ, రమేశ్, చేపూరి కొండలు తదితరులు పాల్గొన్నారు.