Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష
నవతెలంగాణ- భువనగిరిరూరల్
నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యఆరోగ్యశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ సబ్ సెంటర్ వారీగా ఏఎన్ఎం పని తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాత శిశు సంరక్షణ సేవలు, అసంక్రమిత వ్యాదుల నమోదు , కుటుంబ నియంత్రణ , టీబీ, లెప్రసీ, ఎయిడ్స్, మలేరియా వంటి వాటిపై సమీక్షించి లక్ష్యాలను ఆగస్టు1నాటికి సాధించాలని ఏ ఎన్ఎంలను ఆదేశించారు. ఆరోగ్య కార్యకర్తలు గ్రామీణ మహిళలలో అవగాహన కల్పించి, నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రయివేటులో సిజేరియన్ ఆపరేషన్లకు వెళ్లకుండా ప్రభుత్వాస్పత్రిలోనే నార్మల్ డెలివరి జరిగేలా చూడాలన్నారు. గర్భిణులు మొదటి నుండే వ్యాయామంతో పాటు పౌష్టికాహారం తోపాటు సమయానికి డాక్టర్ సలహాతో మందులు వాడినట్టయితే తప్పకుండా నార్మల్ డెలివరీలకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ ఎస్.ప్రశాంత్, డాక్టర్ యశోద, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ సుమన్ కల్యాణ్, డాక్టర్ పాపారావు, డాక్టర్ వినోద్, ఏఎన్ఎంలు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.