Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -వలిగొండ రూరల్
మండలంలోని సంగెం , బొల్లెపల్లి గ్రామాల మధ్యన గల మూసీ నది భీమలింగం కత్వపై నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్ చేశారు. మంగళవారం గుుంతల మాయమైన బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు వచ్చినప్పుడు మూసీి పైన గల భీమ లింగం కత్వనుండి చౌటుప్పల్- భువనగిరికి మధ్యన రాకపోకలు నిలిచిపోతు న్నాయన్నారు. మరో పక్క ప్రజలకు ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 25 ఏండ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి కావడంతో మొత్తం గుంతల మయంగా మారిందన్నారు. రెండేండ్ల క్రితం కురిసిన వర్షానికి బ్రిడ్జికి ఇరువైపుల గల పిల్లర్స్ విరిగిపోయాయన్నారు. దీనితో నీరు బ్రిడ్జి పైనుండి వచ్చినప్పుడు పైనుండి పోయేవాహనదారులు అందులో పడిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంటనే నూతన బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు.
జీవితాంతం పేదల కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి నోముల రాంరెడ్డి
జీవితాంతం పేదల కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి నోముల రాంరెడ్డి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. మంగళవారం మండలంలోని సంగెం గ్రామంలో రాంరెడ్డి 16వ వర్థంతి సందర్భంగా ఆయన స్థూపం వద్ద జహంగీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన రాంరెడ్డి నిరంతరం పేద ప్రజల కోసం పని చేశారన్నారు. గ్రామంలో భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరినీ వివిధ వత్తిదారులందరినీ ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించారన్నారు. ఆయన ఆశయాలను సాధించేందుకు పార్టీ కార్యకర్తలు యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీజిల్లా కమిటీ సభ్యుడు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపళ్లి ముత్యాలు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ ,స్థానిక సర్పంచ్ కీసరి రామ్ రెడ్డి , మండల కమిటీ సభ్యులు దుబ్బ లింగం, నాయకులు నోముల జంగారెడ్డి శాఖ కార్యదర్శి భీమనబోయిన జంగయ్య, ఏనుగు ప్రభాకర్ రెడ్డి, అంగిడి దేవేందర్ రెడ్డి ,మాధవ రెడ్డి ,చింతాకుల మల్లేష్ ,తదితరులు పాల్గొన్నారు.