Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
పట్టణంలోని బొమ్మయిపల్లి అండర్ పాస్ నుంచి రాయగిరి వరకు ఆధ్వన్నంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్అండ్బీ ఏఈ సైదులుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో రోడ్ల విస్తరణ, మోరీలు నిర్మిస్తున్న రోడ్లకు గుంతలు ఏర్పాడ్డాయన్నారు. దీంతోో వాహనదారులు రాకపోకల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఐదు రోజులుగా ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంతల రోడ్లు కాస్తా గోతులుగా మారాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి మాయ కష్ణ, నాయకులు బందెల ఎల్లయ్య, వనం రాజు, చింతల శివ, వనం యాదగిరి పాల్గొన్నారు.
చౌటుప్పల్ : గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌చేస్తూ సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కేంద్రంలో గుంతలమయమైన రోడ్లను సందర్శించారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ వలిగొండ రోడ్డులోని అభిరుచి దాబాకు ఎదురుగా రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడిందని, అదే విధంగా వలిగొండ రోడ్డులోని పాత అమ్మానాన్నా అనాధాశ్రమ సమీపంలో రోడ్డుపై పెద్ద గుంతగా ఏర్పడిందని, వలిగొండ ఎక్స్ రోడ్డు నుండి పద్మశాలి కాలనీకి వెళ్లే సర్వీసు రోడ్డు భారీ ఎత్తున గుంతలు ఏర్పడడంతో పాదచారులు, వాహనదారులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. తంగడపల్లి రోడ్డు, చిన్నకొండూరు రోడ్డులో గుంతలు ఏర్పడి, గుంతల్లో నీరు నిలిచి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని గతంలో అధికారులకు అనేకమార్లు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా రోడ్లకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు ఆకుల ధర్మయ్య, ఎర్ర ఊషయ్య, ఎమ్‌డి.ఖయ్యుమ్, భావండ్లపల్లి స్వామి, తడక నర్సింహా, గుణమోని అయిలయ్య, బత్తుల దాసు, బత్తుల శంకర్, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, బొడ్డు రాజుగౌడ్, కొత్త సత్తయ్య, బాతరాజు దశరథ, దాడి సురేందర్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.