Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెల్తీఫై హాస్పిటల్లో సక్సెస్
- వైద్యబృందానికి అభినందనలు:చలపతిరావు
నవతెలంగాణ-సూర్యాపేట.
జిల్లా కేంద్రంలో అరుదైన ఆపరేషన్ లకు, క్రిటికల్ కేసులకు నిలయంగా హెల్తీఫై హాస్పిటల్ మారింది. మరో అరుదైన ఆపరేషన్ ను హెల్తీఫై వైద్య బందంవిజయవంతంగా పూర్తి చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని వాటర్ విభాగంలో పని చేస్తున్న 45 సంవత్సరాల ఇండ్ల వాసు కి బ్రెయిన్ ఆపరేషన్‌ను పట్టణంలోని జమ్మిగడ్డ లోని హెల్తీఫై మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో బుధవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల 30 నిమిషాలు శ్రమించి ఆపరేషన్ సక్సెస్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్తీఫై మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ అధినేత మతకాల చలపతిరావు మాట్లాడుతూ ఇండ్ల వాసు షుగర్, బిపి, గ్యాస్ట్రిక్ సమస్యలు, బ్రెయిన్ లోని రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టిన సీరియస్ కండీషన్ లో వున్న పేషెంట్‌ను తమ హాస్పిటల్‌కు తీసుకురావడం జరిగిందన్నారు. అనతికాలంలో అరుదైన, క్రిటికల్ ఆపరేషన్ లు హెల్తీఫై హాస్పిటల్ లో సక్సెస్ కావడం సంతోషంగా వుందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఎ.ఎస్.ఐ, ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలతో వైద్య సేవలందిస్తున్నామన్నారు. ఆపరేషన్ సక్సెస్ కావడానికి కృషి చేసిన వైద్యబృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బహుశా మొట్టమొదటిసారి బ్రెయిన్ ఆపరేషన్ ను సక్సెస్ చేసిన హెల్తీఫై హస్పిటల్ ను పలువురు అభినందిస్తున్నారు.