Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు
నవతెలంగాణ-చౌటుప్పల్
టీఆర్ఎస్ ప్రభుత్వానికి తమ పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై ఉన్న దృష్టి పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల నూతన భవనాలపై లేకుండా పోయిందని, వెంటనే గురుకులాల నూతన భవనాలపై దష్టిసారించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు డిమాండ్చేశారు. గురువారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి విజ్ఞానకేంద్రంలో ఆ సంఘం మండలకమిటీ సమావేశం మండల అధ్యక్షులు బర్రె రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వనం రాజు మాట్లాడారు. రాష్ట్రంలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. గురుకుల పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. నూతన భవనాలు నిర్మించకుండా నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారన్నారు. గురుకులాల్లో గదులు సరిగా లేకపోవడం వల్ల, పౌష్టికాహారం లేక విద్యార్థులు అనారోగ్యాలపాలై చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నూతన భవనాలను నిర్మించాలని, నాణ్యమైన భోజనం, విద్యను అందించాలని డిమాండ్చేశారు. ఈ సమావేశంలో సంఘం మండలకార్యదర్శి పల్లె శివకుమార్, ఉపాధ్యక్షులు పాపగల్ల చందు, సహాయకార్యదర్శి ఇట్టెగోని విఘ్నేశ్, మహేశ్, రుద్రగాని మధు పాల్గొన్నారు.