Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామానికి చెందిన టీిఆర్ఎస్ కార్యకర్తలు నీల నరసింహ, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. టీిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు కల్పించిన బీమా సౌకర్యంలో భాగంగా మంజూరైన రూ. రెండు లక్షల చెక్కులను గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తలను కాపాడుకోవడానికి చేస్తున్న కషికి ఈ బీమా సౌకర్యం నిదర్శనం అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సేవలు చేస్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా కేసీఆర్ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మెన్్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ చింతల దామోదర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గిర్కంటి నిరంజన్, చౌటుప్పల్ పట్టణ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కొత్త పర్వతాలు, జిల్లా నాయకులు గుండెబోయిన అయోధ్య యాదవ్, ముప్పిడి శ్రీనివాస్, చిన్నం బాలరాజు, టటీిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు నారెడ్డి అభినందన్ రెడ్డి, జిల్లా నాయకులు తోర్పునూరు మల్లేశం,పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దొడ్డి లింగస్వామి, మల్లేశం, కంచర్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.