Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ బి నార్కట్ పల్లి
కాంగ్రెస్ పార్టీ నుండి అధికార పార్టీ లో మారుంటే నా స్వగ్రామం లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముంద్ర ప్రాజెక్టు ఎప్పుడో పూర్తియ్యేదనీ భువన గిరి: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పేర్కొన్నారు గురువారం మండల పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన, మంచి నీటి శుద్ధికేంద్రంను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణను ఇచ్చిన సోనియగాంధీని మోసం చేయను చేయడం ఇష్టం లేకనే కాంగ్రెస్ పార్టీ లో ఉన్ననని పేర్కొన్నారు. . సీఎం కేసీఆర్ మానవత్వం లేదని... కేవలంరూ.100కోట్లు కేటాయిస్తే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తిఅయి లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే నాకు పేరు వస్తుందనే కారణంతో సీఎం నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. అంతకంటే ముందు ఎనుగులదోరిలో ఇటీవల మతి చెందిన ఎం. ఇందు కుటుంబ సభ్యులను పరిమర్శించి రూ.20 వేలు అందజేశారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సతీమణికి పరామర్శ..
కొత్తగూడెంలో గుండెకు చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సతీమణి పార్వతమ్మను ఎంపీ పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో. టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శిరవీందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉశయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ సిగ బికం. తదితరులు పాల్గొన్నారు.