Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్డీఏ పీడీ ఉపేందర్ రెడ్డి
- క్లస్టర్ లెవెల్ సమీక్ష సమావేశం
నవతెలంగాణ -రామన్నపేట
వర్షాలు సమృద్ధిగా పడి ఉన్నందున హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు విస్తృతంగా నాట్టడంతోపాటు ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాలని డీఆర్డీఏ పీడీ ఉపేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో రామన్నపేట, వలిగొండ మండలాల క్లస్టర్ లెవెల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత హారం ప్రోగ్రాం క్రింద అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటలని రెండు మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందిని ఆయన ఆదేశించినారు. ఈ సమావేశంలో అడిషనల్ పీడీ శ్యామల, రామన్నపేట ఎంపీడీిఓ జి.జలందర్ రెడ్డి, వలిగొండ ఎంపీడీఓ గీత రెడ్డి, డీఎల్పీఓ సాధన, రామన్నపేట ఎంపీఒ లు పోలేశ్వర్ రాజు, కేదాశ్వర్ పాల్గొనారు.