Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
వైద్యం వికటించి 8నెలల గర్భిణీ మృతి చెందిన సంఘటన గురువారం మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీస్లు తెలిపిన వివరాల ప్రకారం...త్రిపురారం మండలం హార్జా తండాకు చెందిన మంజుల (20)కి పెద్దవుర మండలం ఊరబాయి తండా కి చెందిన బాబు నాయక్తో పది నెలల క్రితం పెండ్లి అయ్యింది. డెలివరీ కోసం హార్జా తండాలోని తల్లి గారి ఇంటికి రాగా వైద్య పరీక్షల కోసం మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయాసం రావడంతో టెస్ట్ ల కోసం పంపగా మంజుల అప్పటికే మతి చెందినట్టు తెలిపారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వలనే మంజుల మతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకి దిగగా పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రి కి రాగా ఆయాసం రావడంతో 2డి ఈకో పరీక్ష కోసం కార్డియాలాజిస్ట్ దగ్గరికి పంపినట్లు డాక్టర్ వసంత పేర్కొన్నారు.