Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
నందనం తాటి నీరా ఉత్పత్తుల పరిశ్రమ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ కోరారు. గురువారం ఆయన ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నందనం గ్రామంలోని తాటి నీరా ఉత్పత్తుల పరిశ్రమ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, ఎంపీటీసీ ల సంఘము జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1993 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటై. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత 2019 ఎలక్షన్లో నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభిస్తామని చేప్పి నేటికీ పూర్తిచేయలేదన్నారు. నీరా ఉత్పత్తుల పరిశ్రమ ను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను చూస్తే ఈ ప్రాంతంపై ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎలాంటిదో ప్రజలకు తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, మండల కమిటీ సభ్యులు. గునుగుంట్ల శ్రీనివాస్, జిట్టా అంజిరెడ్డి, ఎల్లంల వెంకటేష్, అబ్దుల్లాపురం వెంకటేష్, కొండాపురం యాదగిరి, అనాజీపురం పాలసంఘం చైర్మన్ గంగనబోయిన పాండు,ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వట్టిపల్లి శివ, పవన్ లు పాల్గొన్నారు.