Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం
- 60 సీట్లు సాధించడమే లక్ష్యం
- సర్వేలకు అందకుండా కాంగ్రెస్ విజయం
- నేనైన....ఇంకోవరైన సీఎం కావొచ్చు..
- రియల్ ఎస్టేట్...కాంట్రాక్టులు చేసి కోట్లు గడిస్తున్న భాస్కర్ రావు.
- విలేకరుల సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భువనగిరి పార్లమెంటు సభ్యులు స్టార్ క్యాంపియన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ ఫ్లో లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఇంట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా 60 సీట్లు సాధించడం లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటిస్తామని ఈ విషయాన్ని ఇప్పటికే రాహుల్ గాంధీ, మాణిక్యం ఠాకూర్ కు వివరించినట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీరో అయిందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేనైనా... ఇంకోఏవరైన సీఎం కావచ్చు అని చెప్పారు. సర్వేలకు అందకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు. జన బలం ఉన్న నాయకులకు టికెట్లు ఇవ్వాలని సూచించానని, ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిగా గెలిచే స్థానం మిర్యాలగూడనేనని అన్నారు. అనేక సేవా కార్యక్రమాలతో బిఎల్ఆర్ ముందుకు పోతున్నారని, ఒకసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని ప్రజలకు కోరారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని 13 జిల్లాల్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. ఇక్కడ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ యొక్క రాష్ట్రాలకు పరిహారాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. నాయకులకు బ్రీఫ్ కేస్ మోసుకెళ్ళే భాస్కరరావు ఎమ్మెల్యేగా ఎన్నికై వేలకోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని విమర్శించారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టు పనులు చేసుకుంటూ కోట్లు గడిస్తున్నాడని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించినట్లయితే టిఆర్ఎస్ కు ఓటేయాలని, అలా ఇవ్వలేదని అందుకే కాంగ్రెస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మహబూబ్ అలీ, అర్జున్, బండి యాదగిరి రెడ్డి, జనిపాషా, నగలక్స్మి, రునాల్ రెడ్డి, సిద్దు నాయక్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.