Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణరంగ కార్మికుల ఉపాధిని కాపాడాలి
నవతెలంగాణ- నల్లగొండ
అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న సిమెంట్ స్టీల్ ఇసుక ,నిర్మాణముడి సరుకులు ధరలు తగ్గించి కార్మికుల ఉపాధిని కాపాడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్గొండ ఆర్టీసీ కాలనీ పని ప్రదేశంలో నిర్మాణ రంగ కార్మికుల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులకు పని దినాలు పడిపోయి ఆదాయం తగ్గిపోయాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం విద్య వైద్యం మరింత ఖరీదు కావడం కార్మికుల జీవిత అవసరాలు తీరక పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిమెంట్ స్టీల్ ఇసుక నిర్మాణ రంగానికి అవసరమైన ముడి సరుకుల ధరలు విపరీతంగా పెంచడం వల్ల నిర్మాణాలు బాగా తగ్గిపోయి కార్మికులపై ఉపాధి పై తీవ్ర ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాడి సాధించుకున్న వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు అందరికీ సకాలంలో అందడం లేదని, క్లైముల కోసం వెల్ఫేర్ బోర్డు కార్డుల కోసం కార్మికులు లేబర్ అధికారుల చుట్టూ చెప్పులరిగే లాగా తిరుగుతున్నారన్నారు. ఇప్పటికైనా లేబర్ అధికారులు పెండింగ్ క్లైమ్ లన్నిటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సర్వేలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, నిర్మాణరంగ కార్మికులు లింగస్వామి, జాల సైదమ్మ, జాల సైదులు, చిల్ల గణేష్, వరమ్మ, ఆడపు రవి, సునీత, రాములు, యాదయ్య, ధనమ్మ, మహేష్, రమేష్, రాధిక తదితరులు పాల్గొన్నారు.