Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలిత రాష్ట్రలలో ఇన్ని పథకాలు ఉన్నాయా..?
- విలేకర్ల సమావేశంలో శాసన సభాపతి పోచారం
నవతెలంగాణ-మిర్యాలగూడ
దేశానికి దిక్సూచిగా కేసీఆర్ పాలన నిలిచిందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆంధ్ర ప్రాంతంలోని చీరాలకు వెళ్తూ మార్గమధ్యంలో మిర్యాలగూడలో తేనేటి విందు కోసం ఆగారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నామన్నారు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్ రైతుబంధు రైతు బీమా మిషన్ భగీరథ హరితహారం పల్లె ప్రకతి వైకుంఠధామాలు, రైతు వేదికలు ఏర్పాటు చేశారని సామాన్య ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.2.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగిందని, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే రైతులను ఆదుకుంటున్నామన్నారు. శాసనసభ సమావేశాలు సజావుగా సాగుతున్నాయని సభ్యులందరూ హుందాగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తను 45 ఏండ్ల రాజకీయ జీవితంలో బడ్జెట్ వద్దులపై చర్చలు జరిగిన దాఖలాలు లేవని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో బడ్జెట్లో పద్దులపై సుదీర్ఘ చర్చ జరుగుతుందని తెలిపారు. శాసనసభాపతిగా తనను ఎంతో తప్తినిచ్చిందని చెప్పారు. బిజెపి 25 రాష్ట్రాల్లో పాలిస్తుందని అక్కడ ఇలాంటి పథకాలు లేవని ముందుగా బిజెపి నాయకులు ఆ విషయాన్ని గుర్తుంచుకొని తెలంగాణపై విమర్శలు చేస్తే బాగుంటుందని చెప్పారు. తాము పాలించే రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేసి ఆ తర్వాత కేసీఆర్ ను విమర్శించాలని సూచించారు. ప్రధానిగా ఉన్న మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కరెంటు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణలో ఆ సమస్య లేదని చెప్పారు. అనవసరంగా మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. ఇప్పటికీ తెలంగాణ ప్రజల ఆశీస్సులు కేసీఆర్కు ఉందని చెప్పారు. అంతకుముందు ఆయనను గౌరవం వందనంతో స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అన్నబిమోజు నాగార్జున చారి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వరరావు, పెద్ది శ్రీనివాస్ గౌడ్, బాలాజీ నాయక్,పాదురి సంజీవ రెడ్డి, ఎండి సోహెబ్ తదితరులు పాల్గొన్నారు.