Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ ప్రణాళికను అమలు చేసి, స్కెల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక వీటీ రోడ్ లోని ఎస్బిఐ, ఏడిబి బ్యాంక్ ఎదుటనిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ ప్రతిపాదించిన పంట రుణాలు పంపిణీ చేయడం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు బంధు నిధులను,ధాన్యం డబ్బులను పాత బకాయిల పేరుతో కట్ చేసుకోవడం సరికాదన్నారు. స్కెల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకర్లు రుణాలు ఇచ్చే నిబంధనలు పాటించడం లేదన్నారు.బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రయివేట్ వ్యక్తుల దగ్గర పంట కోసం అప్పులు తీసుకున్న రైతులు అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.పంట రుణాలు రాక, అధిక వడ్డీలు చెల్లించలేక, పండించిన పంటకు మద్దతు ధర లేక అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.ఏక కాలంలో రైతు రుణాల మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీలో రైతు ప్రతినిధులను నియమించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ మాఫీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు.రుణ మాఫీ జాబితాలు తయారు చేసి బ్యాంకులు పారదర్శకంగా రైతులందరికీ వర్తింపజేేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మందడి రాంరెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు నారాయణ వీరారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు,సీఐటీయూ జిల్లా ఉపధ్యక్షురాలు చెరుకు యాకలక్ష్మి, కెవిపియస్, వ్యవసాయ కార్మిక సంఘం, పట్నం,ఎస్ఎఫ్ఐ, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శులు కోట గోపి, మట్టిపల్లి సైదులు,జె. నర్సింహారావు,దనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి,చినపంగి నర్సయ్య రైతు సంఘం జిల్లా నాయకులు నాగిరెడ్డి శేఖర్ రెడ్డి,గోపాల్ రెడ్డి,పందిరి సత్యనారాయణ రెడ్డి,దండా శ్రీనివాస్ రెడ్డి, బొల్ల నాగేందర్ రెడ్డి,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల: రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు, కొదమగుండ్ల నగేష్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందట ఆ పార్టీ , రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానాకాలం సాగు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఇంతవరకు బ్యాంకు ప్రకటించిన రుణ ప్రణాళికను అమలు చేయట్లేదని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ పంట రుణాలను వానాకాలంలో 51 వేల 230 కోట్లు, యాసంగి 34 వేల 154 కోట్లు మొత్తం 85,383 కోట్లు ప్రకటించారు కానీ, ఆచరణలో రుణాల పంపిణీ జరగలేదని ఈ నెలలో రైతులకు పెట్టుబడి చాలా అవసరం కానీ, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని పైగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు నిధులు మరియు రైతులు అమ్ముకున్న ధాన్యం డబ్బులను బ్యాంకు వాళ్లు రైతులకు ఇవ్వకుండా తమ పాత బాకీలో జమ చేసుకుంటున్నారని దీనివల్ల రైతాంగం పెట్టుబడులకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి సిరికొండ శీను, రైతు సంఘం నాయకులు కుంకు. తిరుపతయ్య, పాతూరి శ్రీనివాసరావు, నందమూరి బాబురావు, అరిబండి ప్రసాదరావు, నూకల రంగారెడ్డి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మరి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు నీలా రామ్మూర్తి, కోదాటి సైదులు, ముషం నరసింహ, అల్వాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మఠంపల్లి : మండలకేద్రంలోని ఆంధ్రబ్యాంక్ ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పంట రుణాలుమాఫీ చేయాలని ధర్నా నిర్వహించి మేనేజర్ కు వినతిపత్రాన్ని అందజేశారు.ఈకార్యక్రమంలో సంఘం నాయకులు భూక్యా పాండూ నాయక్,మాలోత్ బాలూనాయక్,ఎస్డీ రాన్ మియా,కె.వెంకన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఐ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చి నేటి వరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు.ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు పంట రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పల్లె వెంకటరెడ్డి ,దుగ్గి బ్రహ్మం, పి. హుస్సేన్ ,జక్కుల వెంకటేశ్వర్లు చిన్నం వీరమల్లు ,ఆర్. మురళీ కష్ణ ,పి .వెంకట్ రెడ్డి, రేపాకుల వీరస్వామి ,రమేష్, వెంకన్న, సైదా, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.