Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నకిరేకల్
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని స్టేట్ బ్యాంక్, నాగార్జున గ్రామీణ బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు లక్ష లోపు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని, పంట రుణాలు బ్యాంకులో తక్షణమే రైతులకు ఇవ్వాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకి రుణాలు ఇవ్వాలని, బ్యాంకులో రుణాలు ఇచ్చినట్లు బుక్ అడ్జస్ట్మెంట్ విధానాన్ని ఆపాలని, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యానాల కష్ణారెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శి మర్రి వెంకటయ్య, మండల అధ్యక్షులు వెంకట రంగారెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు వంటపాక వెంకటేశ్వర్లు, బాచుపల్లి లక్ష్మణరావు, బొడ్డుపల్లి లక్ష్మీనరసు, మర్రి బక్కయ్య, సాబాది బిక్షం రెడ్డి, వంట పాక కష్ణ, పుట్ట సత్తయ్య, గింజల లక్ష్మి, సిహెచ్ నాగమ్మ, టీ జంగయ్య, ఆదిమల్ల ప్రవీణ్ పాల్గొన్నారు.
దామరచర్ల: రైతులకు తక్షణమే వ్యవసాయ రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎస్బీఐ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వానకాలం సీజన్ ప్రారంభమయ్యే నెలరోజులు గడుస్తున్నప్పటికీ బ్యాంకర్లు ఇప్పటివరకూ వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదన్నారు. సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడుల అవసరం ఎంతగానో ఉన్నట్లు ఆయన చెప్పారు. బ్యాంకర్లు పంట రుణాలను ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తక్షణమే వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ఎలాంటి షరతులు లేకుండా కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ ని కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం బ్యాంక్ మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు డబ్బీకార్ మల్లేష్ , రైతు సంఘం మండల శాఖ అధ్యక్షులు బొచ్చు కోటిరెడ్డి , కార్యదర్శి ఎర్ర నాయక్ , సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వినోద్ , సీఐటీయూ మండల కార్యదర్శి దయానంద్ , కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, నాయకులు జటంగి సైదులు ,సుబాని ,ఖాజా మొయినుద్దీన్ ,రవి ,శ్రీహరి ,విజరు ,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.