Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రతి రోజు విస్తారంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు, దెబ్బతిన్న ఇండ్లకు అధికారులు అంచనా వేసి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన జిల్లా కేంద్ర బాధ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రోజు కురుస్తున్న వర్షాల మూలంగా సూర్యాపేట జిల్లాలో వేలాది ఎకరాలలో అన్ని రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు వెంటనే అన్ని గ్రామాలలో విస్తతంగా పర్యటించి నష్టపోయిన పంటను అంచనా వేసి త్వరత గతిన సహాయం అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనేక గ్రామాలలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని వెంటనే రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. గ్రామాలలో పట్టణాలలో అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయని దీంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వారికి ప్రభుత్వం బియ్యం, కిరోసిన్, నిత్యవసర వస్తువులు అందించాలని కోరారు. వర్షాల మూలంగా ప్రజలు అంటు రోగాలు, విష జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య బందం విస్తతంగా పర్యటించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు . ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలకు ,పట్టణాలకు పారిశుద్ధ నిధులు విడుదల చేసి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ,జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టి పెళ్లి సైదులు, ఎల్గూరి గోవింద్, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి ,జిల్లపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్ ,వీరబోయిన రవి, మేకన బోయిన సైదమ్మ ,మద్దెల జ్యోతి ,చిన్నపంగి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.