Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివద్ధి కి ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయం అ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -ఆత్మకూర్‌ఎస్
గులాబీ జెండాయే అందరికి అండ అని,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోనిఅస్లా తండా, మిడతనపల్లి గ్రామాల కు చెందిన సుమారు 132 మంది కాంగ్రెస్, బిజెపి లకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ లొకి వచ్చిన నేతలకు గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా రాజకీయాలకతీతంగా జరుగుతున్న అభివద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీలను వీడి టీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. ఇప్పటికే విపక్షాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని.ఇంకా ఆయపార్టీలలో కొనసాగుతున్న నాయకులు సైతం వుండబట్టలేక స్వచ్చందంగా తరలి రావడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతత్వంలో రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అభివద్ధి దూసుకుపోతున్నదని చెప్పారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని, కరెంట్ లేక అంధకారంగా మారుతుందని ప్రచారం చేశారని కానీ నేడు తెలంగాణ 24 గంటల నిరంతర విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతున్నదన్నారు. వ్యవసాయరంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. రెండు గ్రామాల నుండి కాంగ్రెస్, బిజెపి లకు కు చెందిన నేతలు వాంకుడోతు భీమా, కరుణాకర్, హార్య, సామ లక్ష్మారెడ్డి, జ్ఞాన సుందర్, వంటి నేతలతో పాటు వారి అనుచరులు , కుటుంబసభ్యులు టీఆర్ఎస్లో చేరారు. జెడ్పీ వైస్ చైర్మెన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీి మర్ల చంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, సింగిల్ విండో ఛైర్మెన్ కోనతం సత్యనారాయణ రెడ్డి. వైఎస్ చైర్మన్ బొల్లే జానయ్య, మండల ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్ , బ్రహ్మం గౌడ్ వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీ లు టిఆర్ఎస్ నాయకులు తదితరుల పాల్గొన్నారు.