Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండల పరిధిలోని చెరువుగట్టులో గల నకిరేకల్ గురుకుల సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు పదోన్నతి కల్పిస్తూ జూనియర్ కళాశాల బైపిసి మొదటి సంవత్సరానికై అడ్మిషన్ల కోసం ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఆ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కోర్సు కు సంబంధించిన సబ్జెక్టులు బాటని, జువాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించడానికి లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు ఈనెల 18న ఆ పోస్టుల భర్తీ కోసం కళాశాలలో డెమో నిర్వహించి ఎంపిక అయిన లెక్చరర్లకు అదేరోజు నియామక పత్రాలను ఇచ్చి భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు ఆసక్తిగల పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని సూచించారు వీరికి గౌరవ వేతనం నెలకు 18 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు.