Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో పిలాయిపల్లి కాలువ ద్వారా నీటిని గ్రామ చెరువులోకి తీసిన కాలువ ఇరువైపులా బాట ఆక్రమణకు గురైంది.కాలువ పూర్తి కాకముందే కాలువకు ఇరువైపులా దారి ఏర్పాటు చేయగా ఓ వైపు ఉన్న కాలువ దారిని కొందరు అక్రమించుకున్నారు. కాలువ పక్కన పోసిన మట్టిని తీసి వ్యవసాయ పంట పొలాల మడులకు వాడుకున్నాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాలువ వెంట వాహనాలు, అధికారులు వెళ్లేందుకు కాలువకు ఇరువైపులకు దారి ఏర్పాటు చేయగా కొంతమంది రైతులు ఆ కాలువ దారి కూడా తమ వ్యవసాయ పొలంలో కలుపుకున్నారు. ఈ విషయంపై రైతులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాలువలో పూర్తిగా నీరు వస్తే ఆ ప్రాంతం తెగిపోయి కింద ఉన్న రైతులు తమపంటలకు నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు.