Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధిపై చర్చలకు సిద్ధం
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై నిందారోపణలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మెన్ కుర్ర కోటేశ్వరరావు హెచ్చరించారు.శుక్రవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో విలేకరు సమావేశంలో మాట్లాడారు.కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక శనిగా దాపురించాడని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటారని గుర్తు చేశారు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదని, అడ్డదిడ్డంగా మాట్లాడి హైలెట్ అయ్యేందుకు చూస్తాడన్నారు.పార్లమెంట్ సభ్యులహోదాను మరిచి ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై అనుచితవ్యాఖ్యలు చేశారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.గత అసెంబ్లీ సమావేశాల సాక్షిగా భాస్కరావుకు 2018 ఎన్నికల్లో డిపాజిట్లు రావని అలా వస్తే తాను టీఆర్ఎస్ ఆఫీసులో అటెండర్‌గా పని చేస్తానని సవాల్ చేశారని,ఆ సవాల్‌ను భాస్కర్‌రావు స్వీకరించి ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారని చెప్పారన్నారు.2018 ఎన్నికలో భాస్కర్‌రావు 36 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో ఓడిపోయారని గుర్తు చేశారు.సవాల్‌కు కట్టుబడిలేక ఆనాడు నల్లగొండ జిల్లాను వదిలేసి భువనగిరి జిల్లాకు వెళ్లాడని, ఇప్పుడు భాస్కర్‌రావుపై విమర్శ చేయడం సరికాదన్నారు.రూ.900 కోట్లతో నియోజకవర్గంలో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాడని నల్గొండలో మూడు పర్యాలు ఎమ్మెల్యేగా ఉండి నీవు ఎంత అభివద్ధి చేశావు చూపించాలని, ఈ విషయంపై చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు.గతంలో రాజశేఖర్‌రెడ్డికి చెప్పులు అందించి సూట్ కేసులు మోసిన నీవు ఎప్పుడు వేలాది కోట్ల రూపాయలు ఎలా సంపాదించావని ప్రశ్నించారు.అహంకారంతో మాట్లాడితే ప్రజలు ఓడించి బుద్ధి చెబుతారనిహెచ్చరించారు. భాస్కరరావు ఎక్కడ రియల్ ఎస్టేట్ చేశారో... ఏ కాంట్రాక్టర్ చేపట్టారో ... చెప్పాలని కనీసం పార్టీ ఫండ్ కోసం వంద రూపాయలు అడిగిన దాఖలాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.బయట జరిగిన గొడవలకు ఎమ్మెల్యే పై రుద్దడం సరికాదన్నారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, వేములపల్లి మాజీఎంపీపీ నామిరెడ్డి కర్నాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ వలిశెట్టి రామకృష్ణ, రైతుసంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ప్రధానకార్యదర్శి పెద్ది శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు వంగాల నిరంజన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాజీద్, నాయకులూ పునాటి లక్ష్మినారాయణ, సాథినేని శ్రీనివాస్, పట్టణ అధికార ప్రతినిధి పిన్నబోయిన శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.