Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణారెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ఫామ్ సాగును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సింగిల్‌విండో ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని రైతు తీగల జనార్థన్‌రెడ్డి వ్యవసాయ భూమిలో ఆయన ఆయిల్ఫామ్ మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా రామకష్ణారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో వరి, పత్తి సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఆయిల్ఫామ్ సాగుచేసి అభివద్ధి సాధించాలని తెలిపారు. మోత్కూరు మండలం పాలడుగులో నాలుగు లక్షల ఆయిల్ ఫామ్ మొక్కలను పెంచుతున్నట్టు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు ఆరువేల ఎకరాల్లో సాగుచేయాలని నిర్ణయించామని తెలిపారు. ఎకరానికి 57 మొక్కలు నాటాలని తెలిపారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఒక మొక్కను రూ.20కి, డ్రిప్ సౌకర్యం అందజేస్తున్నట్టు చెప్పారు. ఆయిల్ఫామ్ వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. రాష్ట్రంలో జులై నుండి 2023 మార్చి వరకు రెండు లక్షల మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో ఛైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, సింగిల్‌విండో వైస్‌ఛైర్మన్ చెన్నగోని అంజయ్యగౌడ్, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, రైతు కన్వీనర్లు కొత్త పర్వతాలుయాదవ్, ముప్పిడి శ్రీనివాస్, నాయకులు పబ్బతి వెంకటయ్య, దొడ్డి శ్రీశైలం, పల్చం రమేశ్, ఢిల్లీ మాధవరెడ్డి, తొర్పునూరి మల్లేశం, పిట్టల శంకరయ్య, దొడ్డి మల్లేశ్, గంగాపురం నరహరి, శాగ రఘునందన్‌రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ పాల్గొన్నారు.