Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
పాల ఉత్పత్తులు ,యంత్రాలు పిల్లింగ్ మిషన్లపై జీఎస్టీ ని రద్దు చేయాలని తెలంగాణ పాడి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో శ్రీకష్ణ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకారం సంఘం ఆవరణలో జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులతో సంతకాల సేకరణ నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు పాడిన వత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నారన్నారు . . పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పరస్పర సహకార సంఘం చైర్మెన్ మల్ రెడ్డి సాంబిరెడ్డి ,డైరెక్టర్లు జల్లి నరసింహులు, మొరిగాడు అశోక్ ,బర్ల సిద్ధ రాములు, దూడల సురేష్, కోనాపురం సుధీర్ కుమార్, మొరిగాడి దేవేందర్, బలరాం ,గాండ్ల చంద్రయ్య, వడ్డేమాన్ బాలరాజ్ పాల్గొన్నారు.