Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
వాతావరణంలో మార్పుల పట్ల ప్రజలు వ్యాధుల నుండి అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ కోటాచలం అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ వైద్యులు సూపర్వైజర్లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వాతావరణంలో మార్పుల వలన వ్యాధుల నివారణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో మార్పుల దశ్యా ప్రజలు పలు వ్యాధులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసు కునేలా వైద్యాధికారులు ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు కల్పించాలన్నారు.అలాగే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో ప్రత్యేకశిబిరాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.దోమల తీవ్రత పెరిగి వివిధ రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. డెంగ్యూ, మలేరియా, ఇతర కీటకజనిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.గ్రామాలలో ఆరోగ్య సిబ్బంది ఫ్రైడే, డ్రైడే ఆవశ్యకతను తెలపా లన్నారు.ఆహార పదార్థాలకు మూతలు ఉంచాలని, ఈగలు వాలకుండా చూసుకోవాలని డయేరియా వ్యాధికి గురికాకుండా నీటిని కాచి చల్లార్చి వడగట్టి తాగేవిధంగా చూడాలన్నారు.అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉందని,సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఆస్పత్రి అభివద్ధి సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు.అనంతరం పోస్టర్‌ను ఆవిష్క రించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు నిరంజన్, హర్షవర్థన్, జిల్లా టీకాల అధికారి వెంకటరమణ, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, జిల్లా క్షయ,కుష్టు నివారణ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, అంజయ్య, కిరణ్, భాస్కర్, రాజు పాల్గొన్నారు.