Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ- రామన్నపేట
ఏక మొత్తంలో రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నూతనంగా పంట రుణాలు ఇవ్వాలని కోరారు. వానాకాలం పంట సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నా ఇప్పటివరకు బ్యాంకు రుణాలు అందివ్వకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందుల పడుతున్నారు. కేవలం 25వేల లోపు పంట రుణాలు మాత్రమే మాఫీ కావడంతో మిగతా అప్పు కోసం ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బందు, దాన్యం డబ్బులు కూడా బ్యాంక్ అధికారులు జమ చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. పాత బకాయిలు వసూలు చేయవద్దనే నిబందన ఉన్నా బ్యాంకులు నిబందనలను బేఖాతర్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బ్యాంకుల ద్వారా 18 శాతం రైతులకు పంట రుణాలివ్వాల్సి ఉన్నా కనీసం 10శాతం రుణాలు పూర్తి చేయలేదన్నారు. ఎలాంటి షరతులు లేకుండా కౌలు రైతులకు కూడా పంట రుణాలిచ్చి పాత రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల అధ్యక్షులు గన్నెబోయిన విజయభాస్కర్, నాయకులు బల్గూరి అంజయ్య, గాదె నరేందర్, అంబటి సురేందర్ రెడ్డి, దోమలపల్లి నర్సింహ్మ, కంకల శేఖర్, గాదె కష్ణ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని రైతుసంఘం మండలకమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని ఎస్బీఐ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుసంఘం రాష్ట్రకమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి మాట్లాడారు. రైతుబంధు, ధాన్యం డబ్బులను పాత బకాయిల కింద బ్యాంకులు జమచేయవద్దని డిమాండ్‌చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని, ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఎకరాకు రూ.లక్ష రుణం ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతాంగానికి, కౌలు రైతులకు సర్వేనెంబర్ల ప్రకారం పంట భీమా ఇవ్వాలని డిమాండ్‌చేశారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదిమూలం నందీశ్వర్, ఆకుల ధర్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, బత్తుల లక్ష్మయ్య, ఉష్కాగుల రమేశ్, కొండె శ్రీశైలం, ఇట్టబోయిన శేఖర్, బోయ యాదయ్య, సప్పిడి రాఘవరెడ్డి, లక్ష్మారెడ్డి, ధాన్రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఎర్ర ఊషయ్య, మానె సాలయ్య, ఆగిరెడ్డి పాల్గొన్నారు.