Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యే శరణ్యమంటూ గోడును వెల్లబోసుకున్న వైనం
నవతెలంగాణ-కోదాడరూరల్
మూడుముళ్ల బంధంతో జీవితాంతం తోడు ఉంటానని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త దేశం కానీ దేశానికి తీసుకెళ్లి విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలతో వెలగొట్టిన సంఘటన పట్టణంలోవెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ శుక్రవారం పట్టణంలోని పెరిక హాస్టల్లో విలేకర్లతో తన గోడును వెల్లబోసుకుంది.తన స్వగ్రామం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామమని, తండ్రి ఎరబోలు వెంకటరెడ్డి వ్యవసాయం చేస్తారని డిగ్రీ చదివిన తనకు కోదాడకు చెందిన ఏనుగు శ్రీనివాసరెడ్డితో 2009లో వివాహమైందని తెలిపింది. కట్నంగా రూ.5లక్షల నగదు, రెండు తులాల బంగారం, 10 ఎకరాల భూమి ఇచ్చారని పేర్కొంది.వివాహ అనంతరం ఇద్దరు పిల్లలైన తర్వాత శ్రీనివాసరెడ్డి అమెరికాకు తీసుకెళ్లి అక్కడ తనకు విడాకులిచ్చి అక్కడే ఉంటూ మరో మహిళను వివాహం చేసుకొని తనను పంపించాడని వాపోయింది.దిక్కుతోచని స్థితిలో తాను కోదాడలోని అత్తవారింటికి వెళ్ళగా వారు కూడా గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త సోదరుడు ఏనుగు సతీష్‌రెడ్డి తన కట్నంతో కోదాడలో కొనుగోలు చేసిన ప్లాట్లు ఉమ్మడి ఆస్తి తనకు దక్కనివ్వకుండా అడ్డుపడుతున్నాడని, తనపై దాడికి కూడా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది.హైదరాబాదులో ఇండ్లు, రత్నవరంలో పొలాలు, కోదాడలో ప్లాట్లు ఉన్నాయని తెలిపింది. తనకు ఆస్తిలో వాటా దక్కకుండా తన భర్త ఫోర్జరీ సంతకాలతో సతీష్‌రెడ్డి తన పేరు మీదికి మార్చుకున్నాడని ఆరోపించింది.ఈ విషయమై 2020లో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించగా సతీష్‌రెడ్డి అధికారులకు లంచాలు ఇచ్చి తనకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాడని పేర్కొంది.ఇద్దరు పిల్లలతో తాను ఎలా బతకాలని అధికారులు, పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని బోరున విలపించింది.