Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబాయితండాలో గురువారం మిషన్‌భగీరథ స్టోరేజీ ట్యాంకు వద్ద విద్యుత్ దీపాల కోసం స్తంభాలు ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో మృతి చెందిన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన తల్లోజు అరుణ్(21), నల్లపు ప్రశాంత్ (17) కుటుంబాలకు, ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జట్టగోనిలింగస్వామి, కల్లోజు వంశీ, కిరణ్ లకు న్యాయం చేయాలంటూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో స్వాములవారి లిం గోటం నీటిశుద్ధి కేంద్రం ముందు ధర్నా నిర్వహి ంచారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ మతులు తల్లోజు అరుణ్ స్వాములవారి లింగోటం గ్రామంలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో ఒప్పంద పనులు నిర్వహిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్లో పంప్ హౌజ్ మోటారు మెకానిక్‌గా పని పనిచేస్తున్నాడన్నారు.నల్లపు ప్రశాంత్ నాంపల్లిలో ఇంటర్‌సెకండియర్ చదువుతున్నాడన్నారు.అయితే వర్షాలు కురుస్తున్నా ఈ సమయంలో సంబంధిత కాంట్రాక్టర్ వీరందర్ని తీసుకెళ్లి నిర్లక్ష్యంగా విద్యుత్ పనులు చేయించడం, ఎల్సీ తీసుకోకుండా అజాగ్రత్తగా వ్యవ హరించడంతోనే ప్రమాదం జరిగి ఇద్దరు మతి చెందారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తు న్నారన్నారు.మతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని అఖిలపక్ష నాయకులు పట్టుబట్టడంతో రాఘవ కన్స్ట్రక్షన్ యాజమాన్యం మతుల కుటుంబసభ్యులతో, గాయపడిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారంతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, తీవ్రంగా గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు, వారికి ఉద్యోగం కల్పించడానికి ఒప్పుకున్నట్టుగా తెలిసింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేతా రవీందర్‌రెడ్డి,సర్పంచ్ అంగిరేకుల పాండు,బీఎస్పీ జిల్లా ఇన్చార్జి పూదరి సైదులు, కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు పూల వెంకటయ్య, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, టీఆర్ఎస్ నాయకుడు ఏడు దొడ్ల ప్రభాకర్‌రెడ్డి, లింగోటం ఎంపీటీసీ రమేశ్, బీఎస్పీ, సీపీఐ, బీజేపీ,టీడీపీ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.