Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.57 వేల నగదు, మూడు తులాల బంగారం, 15 తులాల వెండి అపహరణ
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దొంగతనం
- లబోదిబోమంటున్న బాధితులు
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామానికి చెందిన భూక్యా రవినాయక్ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ లో అద్దెకు వుంటున్నాడు.తమ గ్రామంలో శీతల పండుగ ఉండడంతో రవినాయక్ కుటుంబం ఈనెల 12వ తేదీన ఇంటికి తాళం వేసి సొంత గ్రామానికి వెళ్లారు.ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియనిదొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.రవినాయక్ కుటుంబసభ్యులు శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి డోర్లు పగలగొట్టి, బీరువాలు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి వెంటనే 100 నెంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పట్టణ పోలీసులతో పాటు సీసీఎస్ పోలీసులు క్లూస్ టీం సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.కాగా ఈ సంఘటనలో 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.57వేల నగదు, లాప్టాప్, సెల్ఫోన్, 15 తులాల వెండి ఆభరణాలు చోరికి గురైనట్టు బాధితులు తెలిపారు.బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.