Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
రైతురుణమాఫీ ఏకకాలంలో చేయాలని రైతుసంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఈ విషయమై శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో నెమ్మికల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్‌బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.అకాల వర్షాల కారణంగా అన్ని రకాలపంటలు దెబ్బతినడంతో అన్ని రకాల పంటలను అధికారులు అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని,రైౖతుబంధు డబ్బులు పాత ఖాతాలో జమ చేయకుండా రైతులకు ఇవ్వాలని కోరారు.కౌలురైతులకు కూడా రుణాలివ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పెరుమాళ్ల బాలస్వాసమి, గంపల ఎల్లయ్య, కోతి లక్ష్మారెడ్డి, గోలి భాగ్యమ్మ, కొల్లివెంకన్న పాల్గొన్నారు.
రైతులకు రుణమాఫీ చేయాలి
మునగాల : బ్యాంకుల్లో రైతులకు రుణమాఫీ చేయడంతో కొత్త రుణాలివ్వాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మునగాలలో బ్యాంకుల ముందు ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు నిధులను, ధాన్యం డబ్బును పాత బకాయిల పేరుతో మినహాయించుకోవడం సరికాదన్నారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఆయా బ్యాంక్ మేనేజర్లకుఅందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు దేశీరెడ్డి స్టాలిన్‌రెడ్డి, నాయకులు చందా చంద్రయ్య, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవర వెంకట్ రడ్డి, ఎస్కె.సైదా, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, వ్యవసాయకార్మిక సంఘం నాయ కులు ఎస్.జానయ్య, జూలకంటి విజయలక్ష్మి, ఆరె కష్ణారెడ్డి, వెంకన్న, సైదులు, లింగయ్య, వెంకటాద్రి, జ్యోతి, కోటిలింగం, పాల్గొన్నారు.
గరిడేపల్లి :బ్యాంకుల్లో రైతులకు రుణమాఫీ చేయడంతో కొత్త రుణాలివ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్కె.యాకుబ్ డిమాండ్ చేశారు.సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎస్బీఐ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తుమ్మలసైదులు, మహబూబ్ అలీ, శ్రీను, దోసపాటి భిక్షం, యానాలసోమయ్య, మచ్చ వెంకటేశర్లు, గుండెపు మట్టయ్య, జుట్టుకొండ వెంకటేశ్వర్లు, నర్సింహారావు, రారరెడ్డి పాల్గొన్నారు.
కోదాడరూరల్: రూ.లక్షలోపు రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి బ్యాంకు నుండి రైతు పంటలకు రుణాలు ఇవ్వాలని రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పట్టణంలో ఖమ్మం ఎక్స్‌రోడ్‌లోని ఎస్బీఐ బ్యాంకు ముందు ధర్నా నిర్వహించారు.బ్యాంకు మేనేజర్ సతీష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణకార్యదర్శి మిట్టగనుపుల ముత్యాలు, రైతుసంఘం నాయకులు చిత్తలూరిభీమయ్య, నాగయ్య, వెంకటరెడ్డి, చారి, సైదులు పాల్గొన్నారు.