Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని అదనపు కలెక్టర్ మోహన్‌రావు అన్నారు.కస్టమర్లకు మెరుగైన సౌకర్యం కల్పించడానికి ఇండేన్‌గ్యాస్ కంపెనీ తయారుచేసిన తక్కువ బరువు గల ఫైబర్ సిలిండర్‌ను శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారుల సౌకర్యం కోసం నాణ్యత గల సిలిండర్‌ను ప్రవేశపెట్టడం హర్షనీ యమన్నారు. సూర్యాపేట ఇండేన్ గ్యాస్ డీలర్ తోట శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ కస్టమర్ లకు మెరుగైన సేవలు అందిస్తున్న ఇండేన్ గ్యాస్ ఆధ్వర్యంలో మహిళలకు, వ్ర్రద్దులకు సౌకర్యవంతంగా వుండే విధంగా తక్కువ బరువుగల ఫైబర్ సిలిండర్ మూడు పొరలతో కలిగి ఉండి సురక్షితమైన సిలిండర్ అన్నారు.10 కెేజీల గ్యాస్, సిలిండర్ బరువు 6.30 కిలోలతో కలిపి 16.30 కిలోలు ఉంటుందని,ధర రూ.810 అని తెలిపారు.ఈ సిలిండర్ పారదర్శకంగా,గ్యాస్ వినియోగం కనిపిస్తుందని, అపార్ట్మెంట్లలో నివసించే వారికి అనుకూలంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్ఓ విజయ లక్ష్మీ, ఏఎస్ఓ పుల్లయ్య, తోటకమల పాల్గొన్నారు.