Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపక్షాల హాజరుతో కోరం పూర్తి
- స్వపక్షంలో ఏడుగురు కౌన్సిలర్లు హాజరు, 17 మంది గైర్హాజరు
నవతెలంగాణ-కోదాడరూరల్
కొన్ని రోజులుగా మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంపై కొనసాగుతున్న ఉత్కంఠకు శుక్రవారం తెరపడింది.మున్సిపల్ సమావేశ మందిరంలో విపక్షాలతో కోరం పూర్తి కావడంతో అధికారులు సమావేశం నిర్వహించారు.పాలకవర్గంలో చైర్మెన్‌తో కలిపి 35 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో కాంగ్రెస్ వారు ఎనిమిది మంది, సీపీఐ,టీడీపీల నుండి ఒక్కొక్కరు ఉన్నారు.టీఆర్ఎస్ నుండి 25 మంది ఉండగా ఒకరు చనిపోవడంతో 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు.కాగా నేటి సమావేశానికి కాంగ్రెస్ వారి నుండి ఆరుగురు,టీడీపీ,సీపీఐల నుండి ఒక్కొక్కరు, టీఆర్ఎస్ నుండి ఏడుగురు, చైర్మెన్‌తో కలిపి మొత్తం 15 మంది సమావేశానికి హాజరయ్యారు.ముందుగా ఖరారైన తేదీకె జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలనే చైర్మెన్ పంతం నెగ్గింది సొంత పార్టీ నుండి 17 మంది కౌన్సిలర్లు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.చైర్మెన్‌కు వ్యతిరేకంగా సమావేశాన్ని కోరం లేకుండానే రద్దు చేయాలని కొంతమంది కౌన్సిలర్లు పన్నిన వ్యూహం విఫలమైంది. విపక్షాలు బలంగా చైర్మెన్‌కు సహకారం ఇవ్వడంతో పాటు స్వపక్షంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ మంది కౌన్సిలర్లు హాజరుకావడం గమనార్హం.ఇటీవల సమావేశానికి గైర్హాజరు కావాలని సంతకాల సేకరణలో 20 మంది చేసినట్టు గుసగుసలు వినిపించినా సమావేశ సమయానికి ఒకరో ఇద్దరో స్వపక్ష కౌన్సిలర్లు హాజరవుతారనుకుంటే ఏడుగురు హాజరై అయోమయానికి తెరదించారు.మొత్తం మీద మున్సిపల్ జనరల్‌బాడీ సమావేశం స్వపక్ష కౌన్సిలర్ల పంతాల మధ్య ప్రశాంతంగా ముగిసింది.