Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ప్రీమియర్ కంపెనీ కార్మికుల సంక్షేమమే ప్రీమియర్ ఎక్స్ ప్లొజివ్స్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ద్యేయమని ఆ సంఘం అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు.సోమవారం ప్రీమియర్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ కె.వి యూనియన్ అధికారంలోకి వచ్చాక పదవ వేదన ఒప్పందం బ్రహ్మాండంగా చేశామన్నారు.కార్మికులకు 5300 అగ్రిమెంటు ఇప్పించామన్నారు . ఏల్టిఏ గతం లో కంటే 100శాతం పెంచామన్నారు వీడిఏ 30 పైసలకు పెంచేలా చూసామన్నారు.ఇతర యూనియన్లు బంధువులకు ఉద్యోగాలు కల్పించేందుకే చూశారని, తాము మాత్రం కార్మికుల అభివద్ధికి పనిచేశామన్నారు.ప్రస్తుతం 11 వేతన ఒప్పందం కోసం యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు.ఈ సందర్భంగా ఆ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్,యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గవ్వల రమేష్ ,ప్రధాన కార్యదర్శి ఎలక్షన్ రెడ్డి పాల్గొన్నారు.
యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీని అసంఘం అధ్యక్షులు గొంగిడి మహేందర్రెడ్డి ప్రకటించారు.వర్కింగ్ ప్రెసిడెంట్ గా గవ్వల రమేష్ ,ప్రధాన కార్యదర్శిగా పులేపాక ఆదాము ,ట్రెజరర్ గా గుజ్జ బాలరాజు ,ఉపాధ్యక్షులుగా 9 మందిని ,డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఐదుగురిని ,ఆర్గనైజేషన్ కార్యదర్శులుగా ఏడుగురిని , సహయ కార్యదర్శులుగా 8 మందిని,మహిళా సెక్రటరీ 4 గురిని, స్టాప్ ఉప అద్యక్షునిగా వెంకటయ్య ఆఫీస్ సెక్రటరీ గా బి విరేశం తో 48 మంది కార్యనిర్వాహక కమిటీని నియమించినట్లు ఆయన తెలిపారు.