Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నకిరేకల్
ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించడంలో టీిఆర్‌ఎస్ ప్రభుత్వం విప్లమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల విమర్శించారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ హామీలు నీటి మూటలు గానే మిగిలాయన్నారు. బాలికల పాఠశాల భవనం పెచ్చులూడి వర్షానికి నీరు కారడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షానికి ఆట స్థలమంతా బురద మయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్న నేటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు అందజేయలేదన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ఒంటెపాక వెంకటేశ్వర్లు, నాయకులు సా కుంట్ల నరసింహ, చెన్న బోయిన నాగమణి, ఆర్ ఇందిర, వంటిపాక కృష్ణ, ఆదిమల్ల సుధీర్ పాల్గొన్నారు.