Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ రూరల్
కోటివరాల పథకంలో ఇచ్చిన భూమి సొసైటీకే చెందేలా చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న ,చేతి వత్తిదారుల కన్వీనర్ గజ్జి మురళీధర్ ఆధ్వర్యంలో సోమవారం జేసి చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ మండలం, దొనపల్లి గ్రామ సొసైటీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కోటివారల పథకంలో 4 ఎకరలా భూమి ఇచ్చిందన్నారు. ఈ మధ్య పక్క గ్రామానికి చెందిన వ్యక్తి ఏకరంన్నర భూమి వారికి చెందినదని దున్నాడని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని భూమిని ఇతరులు ఆక్రమించకుండా తమకే హక్కులు కల్పించాలని పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో పెద్దగని నర్సింహా గౌడ్, మహేష్ గౌడ్, అనంతుల స్వామి, వారికి మడగోని స్వామి, నకిరేకంటి స్వామి,జునుకుంట్ల వెంకన్న గౌడ్,బిక్షామయ్య గౌడ్, కసాని ఎల్లగౌడ్, పాపయ్య గౌడ్, కాసాని స్వామి గౌడ్ తదితరులు ఉన్నారు.