Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆత్మకూర్ఎం
మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాపై తక్షణమే కలెక్టర్ విచా రణ నిర్వహించాలని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ మండల కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఉప్పలపాడు గ్రామంలో 6 సంవత్సరాల కిందట పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి 90 మంది వ్యక్తుల దగ్గర ఒక్కొక్కరి వద్ద 30 వేల రూపాయల చొప్పున డబ్బులు టీిఆర్ఎస్ నాయకులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వికలాంగులకు, అర్హులైన పేదలకు, ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు ఇవ్వకుండా, కార్యకర్తలకు, ఏజెంట్లకు ఇండ్లు ఇవ్వడం సరికాదన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇండ్లు ఇవ్వకుంటే ఎంపీ కోమటిరెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు హెచ్చరించారు. అనంతరంమండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన ఎడ్ల మహీధర్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా వైద్యఖర్చులకోసం 20 వేయిల రూపాయలఆర్థికసాయంనిమహీధర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి జెడ్పీటీసీ నరేందర్ గుప్తా ,పీఏసీఎస్ చైర్మెన్జిల్లాల శేఖర్ రెడ్డి, సర్పంచ్ జన్నాయికోడె నగేష్, ఉప సర్పంచ్ దొంతర బోయిన నవ్య భాస్కర్ పాల్గొన్నారు.