Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ఈనెల 20నరాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు, పాఠశాలలు బంద్ విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలో వాల్పోస్టర్ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. విద్యాసంస్థల ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ,పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. కేంద్రం ప్రభుత్వం నూతన విద్యా విధానం అన్న నినాదాన్ని రద్దు చేయాలని తెలిపారు. విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు పాసులు ఇవ్వాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, రావణ్, సంధ్య ,నవ్య ,అంజలి, రేణుక ,సుకన్య పాల్గొన్నారు.