Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
గిరిజనుల బతుకు ఆగం చేస్తే ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్సీ సభవాత్ రాములు నాయక్ అన్నారు. సోమవారం రాచకొండలోని తుంబాయి తండా లో పర్యటించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకొంటున్న భూములకు ఇందిరా గాంధీ హయాంలో ఈ ప్రాంత లంబాడిలకు, దళితులకు, వెనుకబడిన వర్గాల పేదలకు చట్ట బద్దంగా భూపంపిణీ చేసి పట్టాలిచ్చిందన్నారు. పంటభూముల్లో ఫారెస్ట్ అధికారులు వచ్చి హరిత హారం పేరుతో మొక్కలు నాటుతు అడ్డుకుంటే కేసులు పెట్టుతున్నారన్నారు.ఈ కార్యక్రమం లో ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, సర్పంచులు జరుపుల కవిత జగన్, కాట్రోతూ శ్రీను, కరెంటోతూ బిక్షపతి నాయక్ గిరిజన సంగం నాయకులు దేవా, రైతులు ముత్యాల ప్రతాప్ రెడ్డి, మోహన్ రెడ్డి, సురకంటి శ్రీనివాస్ రెడ్డి, యాదిరెడ్డి,జరుపుల లక్ష్మణ్, వినోద్ కుమార్,భూతం ముత్యాలు, యాదయ్య, నోముల ఎటయ్య, నల్లబోతు గిరి, భాస్కర్, పంతు, రఘు, శ్రీను, కేతావత్ గోత్య, లాలు, కాట్రోతూ కిసాన్.