Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
- ముగిసిన ఆందోల్ మైసమ్మ బోనాల మహోత్సవ ఉత్సవాలు
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
తెలంగా సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతిబింబం బోనాల మహోత్సవాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలోని ఆందోల్ మైసమ్మ 17వ బోనాల మహోత్సవ కార్యక్రమంలో సోమవారం మంత్రి పాల్గొన్నారు. ఆలయ సాంప్రదాయాల మేరకు ఆలయ కార్యనిర్వాహణాధికారి చిట్టెడి వెంకట్ రెడ్డి, ఆలయ అభివద్ధి కమిటీ చైర్మెన్ సిద్దిపేట శేఖర్ రెడ్డిలు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. ఆందోల్ మైసమ్మ అమ్మవారికి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. బోనాలు తెలంగాణ సంస్కతిలో ఒక భాగమన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ వెన్ రెడ్డి రాజు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కంటి నిరంజన్ తదితులున్నారు.
ముగిసిన ఆందోల్ మైసమ్మ బోనాల మహోత్సవాలు
ఆందోల్ మైసమ్మ 17వ బోనాల మహోత్సవాలు ఈనెల 16న మొదలై సోమవారంతో ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ మహౌత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహోత్సవాల్లో చివరి రోజు పూర్ణాహుతి నిర్వహించారు. బోనాల మహోత్స వాలకు ఇలాంటి ఆటంకం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులకు, సహకరించిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి చిట్టెడి వెంకట్ రెడ్డి, ఆలయ అభివద్ధి కమిటీ చైర్మెన్‌్ సిద్దిపేట శేఖర్ రెడ్డి కతజ్ఞతలు తెలిపారు.