Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పేరుతో అర్హులైన దళితులకు రూ.10 లక్షలు అందజేసే పథకాన్ని ప్రవేశపెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాల్లో నూతనోత్సాహం మొదలైంది.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అర్హులైన వారికి దళితబంధు అందజేసిన విషయం విధితమే.మండలవ్యాప్తంగా పలుగ్రామాలకు దళితబంధు చాబితా విడుదలవుతుందనే వార్త కొన్ని రోజులుగా మండలవ్యాప్తంగా చక్కెర్లు కొడుతోంది.దీనితో గ్రామ దళిత వాడలోని ప్రజలు స్థానిక నాయకుల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు మొదలయ్యాయి.తమకు అనుకూలంగా ఉన్న నాయకుని ఇంటికి ప్రజలు తిరుగుతూ దళితబంధు తమకే రావాలని అర్జీలు పెట్టుకుంటూ వేడుకుంటునట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే 19 గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గిరిజనతండాలు మినహాయించి మిగిలిన గ్రామాలకు దళితబంధు జాబితాను స్థానిక నాయకులు గ్రామగ్రామాన తయారుచేసి గుట్టుచప్పుడు కాకుండా అర్హులను గుర్తిస్తున్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో దళితుల్లో ఆందోళన మొదలైంది.ఈ వ్యవహారం అంతా మండలంలో కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం స్థానిక నాయకులు గుర్తించిన కూడా వాటికి సంబంధించి సమాచారాన్ని బహిర్గతం చేయకుండా తగిన సమాధానాలు చెప్పుకుంటున్నట్టు వినికిడి.కేవలం గ్రామంలో కొంతమందికి అర్హులను గుర్తించి అందజేసినట్టయితే మిగిలిన వారి నుండి వ్యతిరేకత మొదలవుతుందనే ఆందోళనలో నాయకులు ఉండడం గమనార్హం.స్థానిక ఎమ్మెల్యే కొద్ది రోజులుగా విదేశీ పర్యటనలో ముగించుకొని సోమవారం తిరిగి రావడంతో మండలవ్యాప్తంగా తదుపరి కార్యాచరణగా దళిత బంధు మొదలవుతుందనే ఆశలు జనాల్లో చిగురించాయి.ఏది ఏమైనా మండలవ్యాప్తంగా దళితబంధు హవానే కొనసాగుతూ ప్రధానచర్చగా ప్రతి గ్రామంలో నిత్యం జరుగుతూనే ఉంది.అసలు మండలానికి దళితబంధు విడుదలైందా..లేదా అనేది స్థానిక నాయకులు సమాధానం చెప్పాల్సి ఉంది.