Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండరూరల్
గ్రామాలను అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధి పర్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గోకారంలో రైతువేదిక నెమలి కాల్వలో సీసీ రోడ్లు ప్రారంభించారు. గోకారంలో, జాలుకాల్వలో సీసీ రోడ్లు, అండర్ డ్రయినేజీ శ్మశాన వాటిక, ప్రత్యేకాభివద్ది నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు, అండర్ డ్రయినేజీలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలను అన్ని రంగాలలో అభివద్ధి పర్చడంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్,జెడ్పీటీసీ వాకిటి పద్మా అనంత రెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాల్ నర్సింహ, సర్పంచులు బోళ్ల లలిత శ్రీనివాస్,తుర్కపెళ్లి మాధవి సురేందర్,మద్దెల సందీప్, వంగాల భిక్షపతి, ఎంపీటీసీలు పల్సం రమేష్, కుందారపు యశోద కొమురయ్య,పల్లెర్ల భాగ్యమ్మ రాజు, పడమటి మమత, సురకంటి వెంకట్ రెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి,తుమ్మల వెంకట్ రెడ్డి,ఎంపీడీఓ గీతారెడ్డి, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఏఈ సుగుణాకర్ రావు, పాల్గొన్నారు.
లక్ష్మమ్మకు ఎమ్మెల్యే పరామర్శ
మండలంలోని దాసిరెడ్డి గూడెంకు చెందిన మాజీ మావోయిస్టు నేత,తెలంగాణ ఉద్యమ కారుడు టీిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివుడు తల్లి కునపురి లక్ష్మమ్మ ఇటీవల అనారోగ్యానికి గురైంది. మంగళవారం గోకారంలో పలు అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి లక్ష్మమ్మను పరామర్శించి అన్నివిధాల ఆదుకుంటామని హామినిచ్చారు.