Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలోని రైతులపై అక్రమంగా కేసు పెట్టి పంటను నష్టపర్చిన ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ మంగళవారం సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎస్.సూరజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ తంగడపల్లిలోని రైతులు సర్వేనెంబర్ 687లో పత్తి పంట వేయగా పంటను రియల్ ఎస్టేట్ వారు నష్టం చేశారని తెలిపారు. రైతులపై అక్రమంగా కేసులు పెట్టినట్టు పేర్కొన్నారు. తంగడపల్లి నుండి డి.నాగారం గ్రామం వరకు రైతులు, ప్రజలు నడిచి వెళ్లే నక్ష బాట భూమిని రియల్ ఎస్టేట్ భూమిలో కలుపుకున్నట్టు తెలిపారు. ఆర్డీఓ, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, మండలకార్యదర్శి గంగదేవి సైదులు, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు చీకూరి ఈదయ్య, కొంగరి కనకయ్య, మొగుదాల రాములు, భావండ్లపల్లి స్వామి, రాగీరు కష్ణయ్య, ఎస్కె.మదార్, బత్తుల దాసు, గోశిక కరుణాకర్, గుణమోని అయిలయ్య, మల్లేశం పాల్గొన్నారు.