Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారం పై కలెక్టర్ సమీక్ష
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్లాంటేషన్ పనులు ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరితహారం పై జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీవోలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రెటరీలతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం హరితహారం మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీలోని ప్రతి మొక్క ఉపయోగంలోకి రావాలన్నారు. కేంద్ర బందం అన్ని జిల్లాలు పర్యటిస్తునందున జిల్లాకు కూడా వచ్చే అవకాశమున్నందున అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. నర్సరీల్లో మొక్కలు మిగలకుండా అన్ని ఉపయోగాంలోకి రావాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ మల్టీ లేయర్ ప్లాంటేషన్లో 5 లేదా 6 ఫీిట్ల మొక్కలను ఉపయోగించుకోవాలని గహాలకు , పాఠశాలకు రోడ్లకు ఇరువైపుల పూల మొక్కలు నాటాలన్నారు. జులై చివరి వరకు ఇచ్చిన టార్గెట్ నిభందనలు ప్రకారం పూర్తి చేయాలని కోరారు. డీఆర్డీఏ పీడీి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీలో రిజిస్టర్ మెయింటన్ చేయాలన్నారు. నర్సరీలోని మొక్కలు వివరాలు సమానంగా ఉండాలన్నారు. సమావేశానికి హాజరైన ఎంపీడీఓలకు , ఎంపీఓలకు, ఏపీఓలకు, టటీఏ పంచాయతీ సెక్రెటరీలకు మొక్కల పెంపకం వాటికి వచ్చే తెగుల నివారణ ఇతర సంబంధిత అంశాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సునంద, అడిషనల్ డీఆర్డీఏ పీడీ నాగి రెడ్డి, ఎంపీడీఓలు , ఎం పీఓలు, ఏపీఓలు, టీఏ పంచాయతీ సెక్రెటరీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.