Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ
నవతెలంగాణ - భువనగిరి
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికీి దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రం సుందరయ్య భవన్లో కెేవీపీిఎస్ జిల్లా రెండవ మహాసభ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కష్ణ, నిలిగొండ కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన జాన్ వెస్లీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతి దళిత కుటుంబానికీి దళిత బంధు పథకాన్ని ఇస్తామని చెప్పి కేవలం మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే నియోజకవర్గానికి 100 యూనిట్లు కేటాయించి మిగతా దళితుల్ని మోసం చేస్తున్నారన్నారు. ఈ పథకంలో కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇవ్వకుండా ప్రతి దళిత కుటుంబానికీ రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. దేశంలో రాష్ట్రంలో దళితులపై దాడుల్ని అత్యాచారాల్ని నివారించడంలో కేంద్ర రాష్ట్ర పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీి పాలిత రాష్ట్రాల్లో దళితులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయన్నారు. ఒక వైపు దళిత జపం చేస్తున్న బీజేపీ మరోవైపు దళితులు గిరిజనులు, మైనార్టీలను టార్గెట్‌గా చేసి వారిపై దాడుల్ని నిర్వహిస్తున్నారన్నారు. దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున కులదూరంకారాత్యలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో కులాంతరవాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిందని ఎస్సీ కార్పొరేషన్లో పెండింగ్‌లో ఉన్న రుణాలను వెంటనే చెల్లించాలన్నారు. 101 యూనిట్ల లోపు దళితులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను 300 యూనిట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో కేవీపీిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలకు సీజనల్ వ్యాధులు రావడానికి అవకాశముందన్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు పనిచేస్తున్న ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు .ఈ మహాసభలో సంఘం జిల్లా కార్యదర్శి సిర్పంగి స్వామి, డీివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నిలిగొండ కిషోర్, పాపగల్లలింగస్వామి, జిల్లా నాయకులు సందెల రాజేష్, పల్లెపాటి రామస్వామి, ముడుగుల సంజీవ, మామిడి సురేష్, కోట కృష్ణ, కొండాపురం యాదగిరి దొడ్డి బిక్షపతి, మేడి ముకుంద పాల్గొన్నారు.