Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకువస్తున్న నవతెలంగాణ దినపత్రిక జన గొంతుక అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.మంత్రి జన్మదినోత్సవం సందర్భంగా వచ్చిన నవతెలంగాణ ప్రత్యేక సంచికను సోమవారంరాత్రి స్థానిక క్యాంప్ ఆఫీస్‌లో ఆయన వీక్షించిన అనంతరం మాట్లాడారు.నిజాలను నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ అని పేర్కొన్నారు.పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని పేర్కొన్నారు.ప్రధానంగా నవతెలంగాణ దినపత్రిక ప్రతి సంవత్సరం తన జన్మదినోత్సవం సందర్భంగా ఎనిమిది సార్లు తన జన్మదినం సందర్భంగా ప్రత్యేకసంచిక వేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట రిపోర్టర్ జహంగీర్,ఏడీవీటీ డివిజన్ ఇన్చార్జి మండల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి,కలెక్టరేట్ రిపోర్టర్ రామారావు, చివ్వెంల రిపోర్టర్ సతీష్ పాల్గొన్నారు.