Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాన్పుల లెక్క పక్కాగా ఉండాలి
- కలెక్టర్ రాహుల్‌శర్మ
నవతెలంగాణ-నల్గొండకలెక్టరేట్
ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గించి సాధారణ ప్రసవాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రసూతి వైద్య నిపుణులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో కాన్పుల లెక్క ఇక నుంచి పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసూతి డాక్టర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమ్మ కడుపు కోతలు వద్దు -సాధారణ కాన్పులే ముద్దు అనే సిజేరియన్ సెక్షన్ ఆడిట్ అనే అంశంపై ప్రసూతి డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో హై రిస్క్ ప్రెగెన్సీ కేసులను నియంత్రించాలని తెలిపారు. సాధారణ ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ అడ్డగోలుగా పెద్ద ఆపరేషన్లతో తల్లీబిడ్డల ప్రాణాలతో కొందరు వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పుట్టిన గంటలోపు తల్లి పాలు బిడ్డకు అమతంతో సమానమన్నారు. పెద్ద ఆపరేషన్లతో తల్లికి వారం రోజుల వరకు కూడా పాలు రావటం లేదని నిపుణులు సూచిస్తున్న విషయం ఆయన వైద్యులకు వివరించారు. పుట్టిన ప్రతి బిడ్డ, తల్లిదండ్రుల వివరాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఆస్పత్రిలో అడ్మిషన్ పొందిన తేది, సమయంతో సహా కేసుల వివరాలు సంబంధిత రిజిష్టర్లలలో విధిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. నార్మల్ డెలీవరీలపై ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్లు దష్టి సారించినట్లైతే తల్లీపిల్లల మరణాలను తగ్గించడంలో పాటు నూరుశాతం సాధారణ కాన్పులు ఆస్పత్రుల్లో జరుగుతాయన్నారు.ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న గర్భిణుల ప్రతి ఒక్కరి వివరాలను పక్కాగా సేకరించి కాన్పులు జరిగే వరకు వారి పట్ల పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ ఓ అనిమల్ కొండలరావు వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.