Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలంలోని వల్లభాపురం గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని డీఎల్పీఓ లక్ష్మీనారాయణ అన్నారు.మంగళవారం గ్రామంలో ప్రభుత్వపాఠశాలను, మురుగుకాల్వలు, వీధులను పరిశీలించి మాట్లాడారు.గ్రామపంచాయతీ పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.వర్షాకాలం సీజన్లో గ్రామంలో నీరు నిల్వ ఉండకుండా ఈగలు,దోమలు వృద్ధి చెందకుండా చూడాలన్నారు.సెగ్రిగేషన్ షెడ్‌ను సందర్శించారు.తడి చెత్త నుండి కంపోస్టు ఎరువు తయారీని తనిఖీ చేశారు.పొడి చెత్తను రీసైకిల్‌కు పంపాలన్నారు.వైకుంఠదామాన్ని పరిశీలించారు.నాటిన మొక్కలు, వాటర్ కనెక్షన్, విద్యుత్ వసతులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి సిలువేరు మధు, గ్రామ పంచాయతీ సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు.